According to the Survey of India topo sheets in 1970, the area of Sunnam Cheruvu was 26 acres. In this order, in 2016, HMDA had initially determined the area of this tank as 32 acres. Similarly, the restoration of tanks in the city is being done only within the boundaries determined by the Irrigation Department and the Revenue Department in 2014. Hydra has clarified that it is developing the same in the case of Sunnam Cheruvu. That is why HUDA had canceled the layout laid out there in the past years.
1970లో సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్‌ల ప్రకారం సున్నం చెరువు విస్తీర్ణం 26 ఎకరాలు. ఈ క్రమంలోనే 2016లో హెచ్ ఎండీఏ ఈ చెరువు విస్తీర్ణాన్ని 32 ఎకరాలుగా పేర్కొంటూ ప్రాథమికంగా నిర్ధారించింది. అలాగే 2014లో ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖలు నిర్ధారించిన హద్దుల మేరకే నగరంలో చెరువుల పునరుద్ధరణ జరుగుతోంది. సున్నం చెరువు విషయంలో కూడా అలాగే అభివృద్ధి చేస్తున్నామని హైడ్రా స్పష్టం చేసింది. అందుకే అక్కడ గతంలో వేసిన లే ఔట్‌ను ఏళ్లక్రితం హుడా రద్దు చేసింది. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నందునే అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి 10 ఏళ్లుగా అనుమతులు ఇవ్వడంలేదు. కోర్టు కేసుల్లో ఈ అంశం ఉందని అక్కడి ప్లాట్ యజమానులు చెబుతున్నారు. ఒక వేళ ఎవరైనా నష్టపరిహారానికి అర్హులమని భావిస్తే వెంటనే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలని హైడ్రా సూచించింది. మాదాపూర్ ఐటీకారిడార్‌కు చేరువగా.. బోరబండ బస్తీకి ఆనుకుని.. గుట్టలబేగంపేట వద్ద ఉన్న సున్నం చెరువు పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. చెరువులో కొన్ని దశాబ్దాలుగా రెండు మూడు మీటర్ల మేర పోగైన ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు చెత్తను హైడ్రా తొలగించింది. చెరువులోకి మురుగు నీరు కలవకుండా డైవర్ట్ నాలాలను ఏర్పాటు చేసింది.
#hydra
#avranganath
#hyderabad

Also Read

మాదాపూర్ సున్నం చెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు.. ఆ వ్యాపారిపై కేసు! :: https://telugu.oneindia.com/news/telangana/hydra-demolitions-at-madhapur-sunnam-cheruvu-case-against-on-that-businessman-441641.html?ref=DMDesc

ఆ ఇళ్ల జోలికి వెళ్లం.. గుడ్ న్యూస్ చెప్పిన హైడ్రా కమిషనర్ :: https://telugu.oneindia.com/news/telangana/hydra-chief-ranganath-permits-secured-construction-to-advance-post-july-19-formation-440727.html?ref=DMDesc

హైదరాబాద్ లో ఇల్లు, ఫ్లాట్ కొనే వారికి హైడ్రా హెచ్చరిక..! :: https://telugu.oneindia.com/news/telangana/hydraa-s-key-advice-for-safe-home-buying-in-hyderabad-s-real-estate-market-440255.html?ref=DMDesc